>> Wednesday, April 14, 2010


కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
ఈ అనంత నీరవంలో
నన్ను నేను వెతుక్కోవడానికి,

కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
హృదయాంతరాళాల్లో
ఏ మూలనో పూడుకు పోయిన
ఈప్సితాలు ఈడేర్చుకోవడానికి

కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
నా పాద ముద్రలు పడ్డ
దారులను వెతుక్కోవడానికి

కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
నా స్వావలంబనకు చుక్కానిగా నిలిచే
నా సుషుప్త చేతనను వెతుక్కోవడానికి
ఈ ప్రపంచపు సమూహాలలో
నా అస్తిత్వం నిలుపుకోవడానికి
దుర్బల వేదనామయ జీవితానికో
గమ్యమూ, గమనము నిర్దేశించు కోవడానికి
కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు

3 వ్యాఖ్యలు:

హను April 14, 2010 at 12:45 PM  

good one , anDi bagumdi

Raghu Mandaati April 14, 2010 at 3:14 PM  

Very nice sir.........

malli April 15, 2010 at 7:43 AM  

స్వేచ్ఛను ప్రసాదించమని ఎవరిని (దేనిని)కోరుతున్నారో సింబలైజ్ చేయాల్సింది.కొంచెం
అస్పష్టంగా వుంది.అయినా బావుంది.

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP