ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను

>> Thursday, February 4, 2010


ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను
ఆకాలమే . . . అయినా
ఇవ్వాళ భోరున వాన కురిస్తే బావుణ్ను
మనసు నిండా అలుముకున్న ముసురు
కరిగి కన్నీటి వానగా మారి పోతే బావుణ్ను

ఎక్క డెక్క డివో స్వార్థ మేఘాలు
ఒక్కటొక్కటిగా వచ్చి చేరి
జాతి సమస్తాన్నీ కప్పేశాయి
ఒరుసుకున్నప్పు డల్లా
భయంకరంగా ఉరుముతున్నాయి
రాపిడి ఎక్కువైనప్పుడు
విద్యుల్లతల తాకిడికి
ఎక్కడి వారో ? ఏ తల్లులు కన్న బిడ్డలో
ఈ ముసురుతో ఏ సంబంధము లేక పోయినా
మాడి మసై పోతున్నారు

ప్రతీ గుండెలో దిగులు గూడు కట్టుకున్నా
ఇంత నిర్లిప్తత ఎందుకో ?
ఏ కన్నూ చెమరించడం లేదెందుకో ?
అలక బూనిన అన్ననో ,తమ్ముణ్నో ?
అక్కనో , చెల్లెలినో అక్కున చేర్చు కుంటే చాలు
ఇప్పటి దాకా కమ్ముకున్న మబ్బులు
ఒక్క టొక్కటిగా విడి పోతాయి
ఒక్కో నయనం నుండి చినుకు
ఒక్క టొక్కటే అయినా
జాతి సమస్తం చెమరిస్తే
జడి వాన కురవదా ?
కమ్ము కున్న కుళ్ళు కొట్టుకు పోదా ?
అపార్థాలు తొలగి పోవా?
మనసులు తేలిక పడవా?

కుండ పోతగా కురిసి
ఈ ముసురు వీడి పోతే బావుణ్ను
హరివిల్లు విరిస్తే బావుణ్ను.

6 వ్యాఖ్యలు:

Anonymous February 4, 2010 at 11:29 AM  

baagundi. verpaatuvaadam prastaavana lEkapote baagundedi.

అక్షర మోహనం February 4, 2010 at 1:09 PM  

vaana padatam ante aakaasam telika padatam//
nela gunde baruvekkadam// harivillu odaarpu kadaa! baavundi mee 'VAANA'

అక్షర మోహనం February 4, 2010 at 1:23 PM  

vaana kuriste aakaasam telika padutundi//
kaani neela baruvekkutundi//
harivillu odaarpu..!

చిలమకూరు విజయమోహన్ February 4, 2010 at 5:37 PM  

చాలా బాగుందండి.

భావన February 4, 2010 at 6:15 PM  

బాగుందండి. నిజమే జడి వాన కురియనిదే కుళ్ళు కడిగి వేయబడదు అంతవరకు ఈ మెరుపులు వురుములు తప్పవేమో. పిక్చర్ కూడా చాలా బాగుంది కవితకు.

మధురవాణి February 25, 2010 at 7:17 PM  

ఒక్కో నయనం నుండి చినుకు
ఒక్క టొక్కటే అయినా
జాతి సమస్తం చెమరిస్తే
జడి వాన కురవదా ?

Simply superb!

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP