వెన్నెల స్నానం

>> Sunday, January 3, 2010


ఎంత సేపనీ ఒంటరిగా
ఈ వెన్నెల బరువుని మోయ గలను
ఎన్ని రాశులు చేయగలను
తెమ్మెర తో ఎన్ని ఊసులాడ గలను
ఎన్ని తారలని కళ్ళలో నింప గలను
ఎన్ని మాలలు కట్ట గలను
ఎంత సేపనీ వెన్నెలలో స్నానించ గలను
పార దర్శక మైన పండు వెన్నెల కురుస్తూ నే వుంది
పంచు కోలేని పరవశత్వం
ఎంత కనీ ఓప గలను
ఎంత గానో ఇష్టమైన ఏకాంతం
ఎందుకో మరి ఇంత భారం
ఎద కోయిల ఎంత సేపనీ పాడ గలదు
ఎన్ని రాగాలు పలుక గలదు
మనసు కలువ
ఎంత గానని విరియ గలదు.

1 వ్యాఖ్యలు:

మధురవాణి February 25, 2010 at 7:18 PM  

మాతో కూడా వెన్నెల్లో స్నానం చేయించారండీ ఒకసారి :-)

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP