విభజన

>> Thursday, May 6, 2010

మన నుండి మనల్ని
వేరు చేయడానికి వేన వేల ప్రయత్నాలు

ఎన్ని రకాలుగా విడి పోదాం ?
కులాలుగా, శాఖలుగా
మతాలుగా , జాతులుగా
వర్ణాలుగా , వర్గాలుగా
ఉన్న వాళ్ళుగా, లేని వాళ్ళుగా
దేశాలుగా, ప్రాంతాలుగా , భాషలుగా
ఖండ ఖండాలుగా ఎన్ని ముక్కలవుదాం ?
ఇంకా ఎన్నెన్ని రకాలుగా విడ గొట్ట బడదాం ?

ఒక్కొక్క విభజన వెనుకా
ఎన్ని స్వార్థాలు , మరెన్ని కుట్రలు ?
చైతన్యం చిగురించ కుండా
రక్తం పారించి
రణ భూమిగా, మరుభూమిగా
మార్చే ప్రయత్నాలు ఎన్నెన్నో ?
రగిల్చిన విద్వేషాలు , వైషమ్యాలు ఇంకెన్నో ?
ఒక్కొక్క సందర్భంలో
మన నుండి మనల్నే
వేరు చేయడానికి వినిపించిన కారణాలు
ఎన్నో ? ఎన్నెన్నో ?

పరస్పరం ప్రేమించడానికీ ,
చేయి చేయి పట్టి కలసి నడవడానికీ
మనం మనుషులమన్న
ఒక్క కారణం చాలదా ?

1 వ్యాఖ్యలు:

Telugu May 6, 2010 at 9:33 PM  

రెడ్డి గారు చాలా ధన్యవాదములు అండి బాగా రాసారు . అందుకే అందరిని కలపటానికి , నా ప్రయత్నం
telugukingdom.net . మీరు ఒక్క సారి చూసి మీ అభిప్రాయం చెప్పగలరు

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP