>> Thursday, December 31, 2009


పసికందును పొదవుకున్న

పచ్చి బాలింతను చూడడం ఇష్టం
పిల్లలతో ఆడుకునే తల్లి రూపం తన్మయం
పచ్చని ప్రకృతి ఇష్టం
ప్రభాతపు పసిడి ఎండ ఇష్టం
శీతా కాలంలో పచ్చికపై
పరచుకున్న మంచు దుప్పటీ ఇష్టం
తొలకరి చినుకులన్నా,
అందులో తడవడమన్నా ఇష్టం.
పూవులతో నిండిన పచ్చని చెట్లన్నా,
పచ్చదనం ఊసే లేని
విరగబూసిన మోదుగ చెట్టన్నా
పసితనమన్నా పండు ముదుసలి అన్నా
ప్రకృతి ప్రతిరూపమైన స్త్రీ సౌందర్యమన్నా
అచ్చ తెనుగు పదమన్నా
చక్కటి పాటన్నా చాలా చాలా ఇష్టం
సాయం సంధ్యలో సముద్రమంటే ఇష్టం
నిండిన మా ఊరి చెరువు
నీళ్ళపై పడి మెరిసే
నిండు పున్నమి చంద్రుడన్నా
గిరులు,తరులు,పాల వెల్లువ లాంటి జలపాతాలు
పరవళ్ళు తొక్కే నది అన్నా మరీ ఇష్టం

1 వ్యాఖ్యలు:

sphurita mylavarapu May 14, 2010 at 9:44 PM  

మీ కవితలన్నీ చదివానండీ..చాలా బావున్నాయి..అనువాదాలతో సహా

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP